మహిళపై పోలీసుల గ్యాంగ్‌రేప్
జైపూర్:
రాజస్థాన్‌లోని చురు జిల్లాలో దొంగతనం కేసులో ఓ వ్యక్తిని లాకప్ డెత్ చేసి ఆపై అతడి వదినపై పోలీసులు సామూహిక అత్యాచారం చేసిన వెలుగులోకి వచ్చింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం. నేమి చంద్(23) అనే వ్యక్తిని దొంగతనం కేసులో 15 రోజుల కింద అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. నేమిచంద్, అతడి వదినను స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారు. నేమిచంద్ పోలీస్ దెబ్బలు తాళలేక పిఎస్‌లోనే మృతి చెందాడు. ఈ హత్య వదిన కళ్లారా చూడడంతో ఆమెను గోర్లను పీకేసి, కళ్లు తీవ్రంగా దెబ్బతినేలా పోలీసులు కొట్టారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో ఉన్న పోలీసులు అమెపై సామూహిక అత్యాచారం చేశారు. దీంతో స్థానిక ఎస్‌పికి ఆమె భర్త ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Post a Comment