మునిసిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులపై కక్షసాధింపు చర్యలు తగదు !!
నెల్లూరుజిల్లా :
వెంకటగిరి మునిసిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులుగా విధులు నిర్వహిస్తున్న కొంతమందిపై కక్షసాధింపు చర్యలు మానుకోవాలని...
మాజీ ఏ.ఎం.సి. చైర్మన్ పులుకొల్లు రాజేశ్వరరావు నేతృత్వంలో... టీడీపి నాయకుల బృందం మునిసిపల్ స్పెషల్ ఆఫీసర్ మురళిని కలిసి వినతిపత్రం సమర్పించారు.
మునిసిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులగా కొంతమంది పనిచేస్తున్నప్పటికీ వారికి అధికారులు హాజరు వేయడంలేదని,
తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ ఒక్క మునిసిపల్ కార్మికుడుపై తాము కక్షసాధింపు చేయలేదని,
అదేవిధంగా ప్రస్తుత వైసిపి ప్రభుత్వంలో కూడా మునిసిపల్ కార్మికులపై కక్షసాధింపు చర్యలు మానుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
Comments
Post a Comment