ఫొటోలు తప్ప పూర్తి చేయాలన్న ధ్యాస లేదు
ఫొటోలు తప్ప పూర్తి చేయాలన్న ధ్యాస లేదు
పోలవరంపై తెదేపా వైఖరిని ఎండగట్టిన మంత్రి అనిల్‌కుమార్
అమరావతి:
పోలవరం ప్రాజెక్టు పనులు ఏమాత్రం జరిగాయో చర్చించాలని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ స్పీకర్‌ను కోరారు.
ఏపీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా పోలవరం ప్రాజెక్టుపై ఆయన మాట్లాడుతూ..
పోలవరం వెళ్లి ఫొటోలు తీయించుకోవడం తప్ప ప్రాజెక్టు పూర్తి చేద్దామన్న ధ్యాస అప్పటి ప్రభుత్వానికి లేదని ఆరోపించారు.
డబ్బులు లేకపోయినా రాష్ట్ర ప్రయోజనాల కోసం తీవ్రంగా కష్టపడ్డానని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్పలు చెప్పారని ఎద్దేవా చేశారు.
లక్షలాది కుటుంబాలు ఇబ్బంది పడుతుంటే ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు.
ప్రాజెక్టు వ్యయం అంచనా పెంచుకుంటూ పోవడమే తప్ప తెదేపా ప్రభుత్వం చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు.
లక్షా వెయ్యి కుటుంబాలకు న్యాయం చేయాల్సిన అవసరముందని, శిలాఫలకాలు వేసి ఫొటోలు తీసుకుంటూ కాలక్షేపం చేశారని అన్నారు.
ఆర్‌అండ్‌ఆర్‌కు సంబంధించి ఒక అధికారిని ఏర్పాటు చేయాలని సీఎం జగన్ చెప్పారని గుర్తు చేశారు.
Comments
Post a Comment