వరదలతో అతలాకుతలం అవుతున్న ముంబై

ముంబై:- వరదలతో అతలాకుతలం అవుతున్న ముంబైలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 35 మంది ప్రాణాలు కోల్పోయారు. మరెందరో గాయపడ్డారు. తాజాగా, ఓ ఆనకట్టకు గండిపడి వరద నీరు పోటెత్తడంతో 23 మంది గల్లంతయ్యారు. రత్నగిరిలో ఉన్న తివారీ ఆనకట్టుకు గండి పడడంతో వరదనీరు ఒక్కసారిగా సమీపంలోని ఏడు గ్రామాలను ముంచెత్తింది. దీంతో 12 ఇళ్లు కొట్టుకుపోగా, పలువురు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు గల్లంతైన వారి కోసం గాలింపు మొదలుపెట్టాయి. ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలను వెలికి తీశాయి. మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి...

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?