రివ్యూ: సందీప్ కిషన్ ‘నిను వీడ‌ని నీడ‌ని నేనే’.. అద్దంతో నా ప్రయాణం..

న‌టీన‌టులు: స‌ందీప్ కిష‌న్, మురళీ శ‌ర్మ‌, వెన్నెల కిషోర్, అన్యా త‌దిత‌రులు
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: కార్తిక్ రాజు
నిర్మాత‌లు: స‌ందీప్ దీప్ కిష‌న్

కథ:

సందీప్ కిష‌న్, అన్యా ప్రేమించి ఇంట్లో చెప్ప‌కుండా పెళ్లి చేసుకుంటారు. ఆ త‌ర్వాత వేరు కాపురం పెట్టుకుని హాయిగా ఉంటారు. అయితే ఓ రోజు పార్టీ చేసుకుని ఇంటికి వ‌స్తున్న స‌మ‌యంలో యాక్సిడెంట్ అవుతుంది. అక్క‌డే స్మ‌శానం కూడా ఉంటుంది. యాక్సిడెంట్ జ‌రిగిన త‌ర్వాత ఇంటికి వ‌చ్చి అద్దంలో చూసుకుంటే సందీప్ మొహంలో వెన్నెల కిషోర్ క‌నిపిస్తాడు. ఆ త‌ర్వాత కూడా అదే కంటిన్యూ అవుతుంది. దాంతో డాక్ట‌ర్ ద‌గ్గ‌రికి వెళ్తారు. అప్పుడే తెలుస్తుంది.. సందీప్ బాడీలో వెన్నెల కిషోర్ ఆత్మ ఉంటుంద‌ని. అక్క‌డ్నుంచి ఏం జ‌రిగింది అనేది అస‌లు క‌థ‌..

క‌థ‌నం:

క‌థ 2035లో మొద‌ల‌వుతుంది. డి16 లాంటి అద్భుత‌మైన సినిమా తెర‌కెక్కించిన కార్తిక్ న‌రేన్, మాళ‌విక న‌య్య‌ర్ గెస్ట్ అప్పీయ‌రెన్స్‌తో ఈ క‌థ మొద‌ల‌వుతుంది. డాక్ట‌ర్ ముర‌ళీ శ‌ర్మ త‌న కెరీర్లో ఎదురైన ఓ రేర్ కేస్ గురించి ఆ స్టూడెంట్స్‌కు చెప్తాడు. అప్పుడే సందీప్ కిష‌న్ క‌థ స్టార్ట్ అవుతుంది. 35 ఏళ్ల ముందు అంటూ 2035లో క‌థ మొద‌లు పెట్ట‌డం ద‌ర్శ‌కుడి తెలివితేట‌ల‌కు నిద‌ర్శ‌నం. గ‌తాన్ని ప్ర‌స్తుతానికి మార్చి ఈ క‌థ‌ను మొద‌లుపెట్టాడు ద‌ర్శ‌కుడు కార్తిక్ రాజు. మొద‌ట్లో హీరో హీరోయిన్ల మ‌ధ్య ప్రేమ‌.. చిన్న గ‌ల్లీ గొడ‌వ‌తో నార్మ‌ల్ క‌థ‌లాగే సాగిపోతుంటుంది. ఆ త‌ర్వాత చిన్న యాక్సిడెంట్ తో క‌థ మొత్తం మారిపోతుంది. అప్ప‌టి వ‌ర‌కు వాళ్లు వాళ్ల‌లాగే ఉంటారు కానీ యాక్సిడెంట్ త‌ర్వాత స్మ‌శానం వైపు నుంచి ఇంటికి వ‌చ్చిన త‌ర్వాత సందీప్ కిష‌న్ మొహం వెన్నెల కిషోర్ మాదిరి.. ఆయ‌న భార్య అన్య మొహం వెన్నెల కిషోర్ భార్య‌లా మారిపోతుంది. అక్క‌డ్నుంచి క‌థ అనేక మ‌లుపులు తిరుగుతుంది. ఫ‌స్టాఫ్ అంతా వీటి చుట్టూనే అద్భుతంగా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు ద‌ర్శ‌కుడు కార్తిక్ రాజు. ఇంట‌ర్వెల్ టైమ్‌కు అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చి.. ఆ త‌ర్వాత క‌థ ముందుకు సాగించాడు. కానీ సెకండాఫ్ వ‌చ్చేసరికి అస‌లు పాయింట్ రివీల్ అయిపోయేస‌రికి పెద్ద‌గా ఆస‌క్తి లేకుండా అయిపోయింది. క్లైమాక్స్ వ‌ర‌కు ఒకే పాయింట్ ప‌ట్టుకుని తీసుకెళ్లాడు. అక్క‌డే కాస్త నెమ్మ‌దించిన ఫీల్ వ‌స్తుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి సెంటిమెంట్ డోస్ కూడా ఎక్కువైపోయింది. అయితే ఎంత స్లోగా అనిపించినా కూడా ద‌ర్శ‌కుడు తీసుకున్న క‌థ మాత్రం అభినంద‌నీయం. ఈ ప్ర‌య‌త్నానికే సినిమా ఓ సారి ఈజీగా చూసేయొచ్చు.

న‌టీన‌టులు:

సందీప్ కిష‌న్ బాగానే చేసాడు. ఈయ‌న గ‌త సినిమాల‌తో పోలిస్తే ఇందులో న‌ట‌న‌కు కొద్దిగా స్కోప్ ఉంది. ఆయ‌న భార్య‌గా అన్య బాగా చేసింది. ఇక హీరో త‌ర్వాత అలాంటి పాత్ర వెన్నెల కిషోర్ చేసాడు. సందీప్ కిష‌న్ త‌ర్వాత సినిమాను ఆయ‌నే నిల‌బెట్టాడు. ఇక ముర‌ళీ శ‌ర్మ కూడా బాగానే చేసాడు. వ‌చ్చే రెండు మూడు సీన్స్ బాగున్నాయి. మిగిలిన సీన్స్‌లో అంతా ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోయే వాళ్లే ఉన్నారు.

టెక్నిక‌ల్ టీం:

థ‌మ‌న్ ఎస్ఎస్ సంగీతం ప‌ర్లేదు. పాట‌లు రెండే ఉన్నాయి. అవి ప‌ర్లేద‌నిపించాయి. ఇదిలా ఉంటే క‌త్తి మ్యూజిక్ ఇక్క‌డ వినిపించ‌డం విశేషం. ఎడిటింగ్ చాలా బాగుంది. అయితే సెకండాఫ్ కూడా ఇంకాస్త శ్ర‌ద్ధ పెట్టుంటే సినిమా చాలా విజ‌యం సాధించి ఉండేది. సినిమాటోగ్ర‌ఫీ ప‌ర్లేదు. ద‌ర్శ‌కుడిగా కార్తిక్ రాజు మంచి క‌థ‌ను తీసుకున్నాడు. స్క్రీన్ ప్లే కూడా చ‌క్క‌గా రాసుకున్నాడు. అయితే సెకండాఫ్ కాస్త ఫోక‌స్ చేసుంటే అనుకున్న ప్ర‌య‌త్నం రీచ్ అయ్యుండేది. అయినా కూడా ఓ కొత్త ప్ర‌య‌త్నాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చాడు ద‌ర్శ‌కుడు.

రేటింగ్: 3/5

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?