వైసీపీ దాడులపై అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానం
అమరావతి:
ఏపీ శాసన మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి.
రాష్ట్రంలో జరుగుతున్న వైసీపీ రాజకీయ దాడులపై శాసన మండలిలో టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు.
అలాగే ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణపై పీడీఎఫ్ వాయిదా తీర్మానం ఇచ్చింది.
అభ్యర్థులకు అన్యాయం జరిగిందని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు వాయిదా తీర్మానం ఇచ్చారు.
వాయిదా తీర్మానాలను మండలి ఛైర్మన్ షరీఫ్ తిరస్కరించారు.
తర్వాత జరిగే చర్చలో ఈ అంశాలపై మాట్లాడాలని సూచించారు.
Comments
Post a Comment