భర్త వేరొక మహిళతో అక్రమ సంబంధం
గుంటూరు: భర్త వేరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తనను పట్టించుకోవట్లేదని ఓ మహిళ ఆందోళనకు దిగింది. చైతన్య, సరిత దంపతులు గుంటూరు జిల్లా తాడేపల్లిలో నివాసముంటున్నారు. అయితే కొంతకాలంగా చైతన్య వేరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తనను పట్టించుకోవట్లేదని సరిత ఆవేదన చెందుతోంది. ఈ నేపథ్యంలోనే ఆమె భర్త ఇంటి ముందు న్యాయ పోరాటానికి బైఠాయించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను స్టేషన్‌కు తరలించారు.
Comments
Post a Comment