ఏం చేయాలో మాకు తెలియ‌దా.. మీడియాపై జీవితా రాజ‌శేఖ‌ర్ సీరియ‌స్..

తెలుగు ఇండ‌స్ట్రీలో ఉన్న ఫైర్ బ్రాండ్స్‌లో జీవిత రాజ‌శేఖ‌ర్ కూడా ఒక‌రు. ఈమె మీడియా ముందుకొచ్చిందంటే చాలు ఎవ‌రో ఒక‌రి తాట తీయాల్సిందే. అంత‌గా రెచ్చిపోతుంది ఈ మాజీ హీరోయిన్. ఇప్పుడు కూడా ఇదే జ‌రిగింది. అయితే ఈ సారి ఏకంగా మీడియానే టార్గెట్ చేసింది జీవిత‌. క‌ల్కి సినిమా విష‌యంలో ఈమె జ‌ర్న‌లిస్టుల‌పై మాట‌ల తూటాలు పేల్చింది. గ‌రుడవేగ త‌ర్వాత భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన క‌ల్కి చిత్రానికి ఊహించిన టాక్ రాలేదు. క‌లెక్ష‌న్ల ప‌రంగా కూడా ఈ చిత్రం వెన‌కే ఉంది. 

నిర్మాత జీవిత రాజ‌శేఖ‌ర్ మాత్రం సినిమా విజ‌యం సాధించింది.. మాకు డ‌బ్బులు కూడా బాగానే వ‌స్తున్నాయ‌ని చెబుతున్నారు. ఈ సంద‌ర్భంగా ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసారు చిత్ర‌యూనిట్. అ..! ఫేమ్ ప్రశాంత్ వర్మ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో రాజ‌శేఖ‌ర్ మ‌రోసారి పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టించాడు. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ చుట్టూ అల్లుకున్న క‌థ ఇది. ఇక ప్రెస్ మీట్లో విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆస‌క్తిక‌ర‌మైన సమాధానాలు చెప్పింది జీవిత‌. అందులో అక్క‌డే ఉన్న ఓ జ‌ర్న‌లిస్ట్ మీరు ఈ చిత్ర ద‌ర్శ‌క‌త్వంలో కూడా వేలు పెట్టారంట క‌దా అంటూ అడిగేసాడు.

ఈ ప్ర‌శ్న వినగానే జీవితకు కోపం న‌షాలానికి అంటేసింది. వెంట‌నే ఆ ప్ర‌శ్న అడిగిన మీడియా విలేఖ‌రిపై క‌స్సున లేచింది ఈ ద‌ర్శ‌క నిర్మాత‌. క‌ల్కి సినిమా చేయ‌డానికి త‌మ‌కు 20 కోట్లకు పైగా ఖ‌ర్చు అయింద‌ని.. అన్ని కోట్లు పోసి సినిమా చేస్తున్న‌పుడు క‌నీసం న‌చ్చుతుందా లేదా అని చూసుకునే అధికారం త‌మ‌కు లేదా అని ప్ర‌శ్నిస్తుంది ఈమె. పైగా అన్ని కోట్లు పెట్టి చేసిన నిర్మాతలకు త‌మ సినిమా న‌చ్చాలి క‌దా అని ప్ర‌శ్నించింది.. ఆ సినిమా త‌న‌దైనపుడు.. డ‌బ్బులు కూడా తానే పెడుతున్న‌పుడు అన్నీ ద‌గ్గ‌రుండి చూసుకోవాల్సిన బాధ్య‌త అయితే ఉంటుంది క‌దా అంటూ సీరియ‌స్ అయింది జీవిత‌.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?