కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ తిరుమల రాక !

తిరుపతి, జూలై 04: కేంద్ర అటవీ, పర్యావరణ , వాతావరణ మార్పులు, సమాచార ప్రసారాల శాఖామాత్యులు  శ్రీ ప్రకాష్ జవదేకర్ ఈనెల 6 , 7 తేదీలలో జిల్లా లో పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ డా.ఎన్.భరత్ గుప్తా ఒకప్రకటనలో తెలిపారు.

ఈనెల 6న మద్యాహ్నం హైదారాబాద్ విమానాశ్రయం నుండి బయలుదేరి 1.25 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని, రోడ్డుమార్గాన తిరుమల వెళ్ళి బస చేస్తారు.

ఈనెల 7 న ఆదివారం  ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుని 10 గంటలకు తిరుపతిలో  స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో  పాల్గొని మద్యాహ్నం 2.15 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుండి  డిల్లీకి తిరుగుప్రయాణం అవుతారని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?