వైసీపీ ఎమ్మెల్యేకు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన న్యాయస్థానం ..
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే ఎం.ఎస్.బాబుకు షాక్ ఇచ్చింది
ఒంగోలు సంచార న్యాయ స్థానం. ఎం.ఎస్ బాబుకు అరెస్టు వారెంట్ జారీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
చెక్కు బౌన్స్ కేసులో ఆయన కోర్టుకు వాయిదాకు హాజరు కానందున ఆయనకు న్యాయస్థానం వారెంట్ జారీచేసింది.
ఒంగోలుకు చెందిన ఓ వ్యక్తికి ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో ఆ వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
చెక్స్ బౌన్స్ కేసు ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు వాదనలు వింటోంది.
కానీ బాబు మాత్రం విచారణకు గైర్హాజరవుతుండటంతో కోర్టు సీరియస్‌గా స్పందించింది.
ఎమ్మెల్యే గైర్హాజరుకావడంతో ఒంగోలు సంచార న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
Comments
Post a Comment