టిడిపి సీనియర్ నేత ఆలపాటి రాజా కామెంట్స్ ...
గుంటూరు :
అసెంబ్లీలో రైతు సమస్యలపై జరిగిన చర్చలో సీఎం, మంత్రులు ప్రవర్తించిన తీరు సభ్య సమాజం సిగ్గు పడేలా ఉంది
మనందరికీ అన్నం పెట్టే రైతును ఆదుకునే విషయంలో ప్రభుత్వ ధోరణి బాధాకరం
వడ్డీ లేని రుణాల విషయంలో తెదేపా ప్రభుత్వంపై నిందలు వేశారు..
మేం వాస్తవాలు చెప్పేసరికి దమ్మిడి, అణా అంటూ విషయాన్ని పక్కదోవ పట్టించారు
వాస్తవాలు ఒప్పుకోకుండా చర్చను పక్కదారి పట్టించటం ప్రభుత్వానికే చెల్లింది
ముఖ్యమంత్రి జగన్ సభలో మాట్లాడిన తీరు బాగాలేదు
సంఖ్యా బలం చూపి బెదిరించేలా సీఎం మాట్లాడారు
బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్ర అభివృద్ధి ఎలా అనేది కనిపించడం లేదు
అభివృద్ధి విషయంపై ఆర్థిక మంత్రికి కనీస అవగాహన లేదు
పిట్టకథలు వినేందుకు బాగుంటాయి తప్పితే ఉపయోగం లేదు
తెదేపా ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదని చెప్పిన ముఖ్యమంత్రి.... ఈ బడ్జెట్లో సున్నా వడ్డీ కోసం కేవలం వంద కోట్లు మాత్రమే కేటాయించారు
మాట్లాడే మాటలకు చేసే పనులకు సంబంధం లేదని రుజువైంది..
Comments
Post a Comment