రాజ‌మౌళికి షాక్ ఇచ్చిన అలియా భ‌ట్.. రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్‌తోనే జ‌క్క‌న్న‌..

రాజ‌మౌళికి RRR విడుద‌ల‌కు ముందే చుక్క‌లు చూపిస్తుంది. సాధార‌ణంగా జ‌క్క‌న్న సినిమా అంటే హీరో హీరోయిన్ల‌కు చుక్క‌లు క‌నిపిస్తుంటాయి. ఎందుకంటే అందులో యాక్ష‌న్ సీన్స్.. పాట‌లు అలా ఉంటాయి మ‌రి. కానీ ఇప్పుడు RRR విష‌యంలో మాత్రం రాజ‌మౌళికే ముందుగా చుక్క‌లు క‌నిపిస్తున్నాయి. ఈ చిత్ర షూటింగ్ అనుకున్న‌ట్లుగా సాగ‌డం లేదు. ఇప్ప‌టికే రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ గాయ‌ప‌డ‌టంతో దాదాపు నెల రోజుల‌కు పైగానే షూటింగ్ పోస్ట్ పోన్ అయింది. అన్నీ కుదిరి ఇప్పుడు సెట్ అయింది అనుకుంటున్న స‌మ‌యంలో అలియా భ‌ట్ కూడా RRR షూటింగ్‌కు దూరంగా ఉంది. 

దాంతో ఇప్పుడు చేసేదేం లేక ఆమె లేని స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నాడు రాజ‌మౌళి. అలియా భ‌ట్ ప్ర‌స్తుతం ప్రియుడు ర‌ణ్‌బీర్ క‌పూర్‌తో ఉంది. ఇప్ప‌ట్లో ఆమె షూటింగ్ వైపు రావ‌డం క‌ష్ట‌మే. అందుకే రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ ఎంట్రీ సాంగ్ తెర‌కెక్కించ‌బోతున్నాడు ద‌ర్శ‌క‌ధీరుడు. దీనికోసం ఏకంగా 3 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నాడు జ‌క్క‌న్న‌. ఈ ఇంట్రో సాంగ్‌లో 1000 మందికి పైగా జూనియ‌ర్ ఆర్టిస్టులు ఉంటార‌ని తెలుస్తుంది. ఇక దాంతో పాటు ఇందులో యాక్ష‌న్ స‌న్నివేశాల కోసం 12 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు చేస్తున్నారు. 

అది కూడా కేవ‌లం ఎన్టీఆర్ వ‌ర‌కు మాత్ర‌మే.. రామ్ చ‌ర‌ణ్ యాక్ష‌న్ సీన్స్ మ‌ళ్లీ ప్ర‌త్యేకం. ఇందులో అల్లూరిగా రామ్ చ‌ర‌ణ్.. కొమ‌రం భీంగా ఎన్టీఆర్ న‌టిస్తున్నారు. సీత పాత్ర‌లో అలియా న‌టిస్తుంది. ఇంకా ఎన్టీఆర్ జోడీ ఎవ‌రో తెలియ‌లేదు. ఆ భామ కోసం చూస్తున్నాడు రాజ‌మౌళి. ఇప్ప‌టి వ‌ర‌కు RRR కోసం చేసే ప్ర‌తీ చిన్న ప‌ని కూడా సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ చిత్రంలో అజ‌య్ దేవ‌గ‌న్, అలియా భ‌ట్, స‌ముద్ర‌ఖ‌ని న‌టిస్తున్నారు. మొత్తానికి RRR షూటింగ్ అయ్యేలోపు రాజ‌మౌళికి ఇంకెన్ని క‌ష్టాలు వ‌స్తాయో మ‌రి.. జులై 30, 2020న ఈ చిత్రం విడుద‌ల కానుంది.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?