ఎమ్మెల్యేలు, మంత్రుల హాజరుపై సీఎం జగన్ నిఘా...ఇకపై అసెంబ్లీలో అటెండెన్స్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాల్టి నుంచి అసెంబ్లీకి ఎవరెవరు వస్తున్నారో ... ఎవరెవరు రావడంలేదో.. లెక్క తేల్చాలని అధికారుల్ని ఆదేశించారు. దానిలో భాగంగా నేటి నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకి అటెండెన్స్ వేయాలని నిర్ణయించారు. ప్రతి సభ్యుడి ఏ టైంకి సభకు వస్తున్నారు.. ? ఎప్పుడు వెళ్తున్నారు ? అన్న సమాచారాన్ని పక్కాగా నమోదు చేయాలని చీఫ్ విప్‌కి ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ప్రతిరోజు సాయంత్రం తనకు నివేదిక ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు.
సభలో టీడీపీ పై వైసీపీ చేస్తున్న దాడి సరిపోవడం లేదని భావించిన ముఖ్యమంత్రి జగన్... ఇంకా దూకుడు పెంచాలని డిసైడ్ అయ్యారు. టీడీపీ నేతలపై అసెంబ్లీలో దాడి చేస్తున్న సమయంలో ఎక్కువ మంది వైసీపీ ఎమ్మెల్యే అసెంబ్లీలో ఉండం లేదని ఆయన భావిస్తున్నారు. అందుకే ఇక నుంచి తమ పార్టీకి చెందిన సభ్యులు ఎవరెవరు సభకు వస్తున్నారన్నదానిపై ఆరా తీస్తున్నారు. ఎమ్మెల్యేలు హాజరుకు సంబంధించన బాధ్యతల్ని ఆయా జిల్లాల మంత్రులకి అప్పగించారు.
Comments
Post a Comment