భారీ వర్షం ... రన్ వే పై జారిన విమానం
ముంబై పరిసర ప్రాంతాల్లో ఇవాళ కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
సోమవారం రాత్రి ముంబై విమానాశ్రయంలోని రన్‌వేపై ఓ విమానం ల్యాండింగ్ సమయంలో జారింది.
జైపూర్ నుంచి వస్తున్న స్పైజ్‌జెట్ రన్‌వేపై జారడంతో.. ప్రస్తుతం ఆ రన్‌వేను మూసివేశారు.
కానీ విమానంలో ఉన్న ప్రయాణికులకు ఏమీకాలేదు. తాత్కాలికంగా రెండో రన్‌వేను ఆపరేట్ చేస్తున్నారు.
స్పైస్ జెట్ విమానం రన్‌వేపై జారిన ఘటన తర్వాత సుమారు 54 విమానాలను దారిమళ్లించారు.
అహ్మదాబాద్, బెంగుళూరు వైపు అవి వెళ్లాయి. తమ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు ఎయిర్ విస్టారా సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేసింది.
వెదర్ సరిగాలేని కారణంగా తమ విమానాలు కూడా ఆలస్యం కానున్నట్లు ఇండిగో ప్రకటించింది.
సియోల్ నుంచి వస్తున్న కొరియన్ విమానంతో పాటు ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి వస్తున్న లుఫ్తాన్సా, బ్యాంకాక్ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానాలను దారిమళ్లించారు.
ఏకధాటిగా కురుస్తున్న వర్షాల వల్ల సెంట్రల్ రైల్వే పరిధిలోని అన్ని సబర్బన్ రైళ్లను రద్దు చేశారు.
Comments
Post a Comment