పులివెందులో దారుణహత్య

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వగ్రామం పులివెందులలో దారుణం జరిగింది.

పట్టణంలోని రాణితోపులో ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు గొంతుకోసి హత్య చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

కాగా మృతుడికి సంబంధించిన విషయాలు తెలియరాలేదు.

హత్యకు గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. సీఎం సొంతవూరు కావడంతో ఈ వార్త రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?