విద్యుత్ ఉద్యోగుల పిటిషన్‌పై సుప్రీంలో విచారణ
దిల్లీ:
తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ ఉద్యోగుల విభజన అంశం మరోసారి సుప్రీంకోర్టుకు చేరింది.
విద్యుత్ ఉద్యోగుల కేటాయింపులపై జస్టిస్ ధర్మాధికారి కమిటీ ఇచ్చిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ
తెలంగాణ జెన్ కో, ట్రాన్స్ కో, డిస్కంలు, ఉద్యోగ సంఘాల సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేశాయి.
దీనిపై సోమవారం విచారణ చేపట్టిన జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనం.. జస్టిస్ ధర్మాధికారి కమిటీ మార్గదర్శకాలపై సవాలు చేయలేరని..
కావాలంటే ఉద్యోగుల తుది కేటాయింపులను సవాలు చేసుకోవచ్చని పిటిషనర్లకు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది.
విద్యుత్ ఉద్యోగుల విభజన సమస్యపై ఏర్పాటైన జస్టిస్ ధర్మాధికారి కమిటీ ఉద్యోగులందరికీ ఆప్షన్ల అవకాశం ఇచ్చింది.
విభజన సమస్య కేవలం 1157 మంది ఉద్యోగుల విషయంలో ఉంటే మొత్తం 10,400 మంది ఉద్యోగులకు ఆప్షన్లను ఇవ్వడాన్ని తెలంగాణ విద్యుత్ కార్పొరేషన్లు, డిస్కంలు, ఉద్యోగులు అంగీకరించడం లేదు.
కమిటీ మార్గదర్శకాలతో విద్యుత్ ఉద్యోగుల విభజన మరింత సంక్లిష్టమైందని కోర్టులో పిటిషన్ వేశారు.
తుది కేటాయింపులపై సవాలు చేసుకునే స్వతంత్రతను సుప్రీంకోర్టు పిటిషనర్లకే ఇచ్చింది.
Comments
Post a Comment