చంద్రబాబు ముసలివారు , లోకేష్ పులకేసి..
టీడీపీకి కొత్త నాయకుడు కావాలన్న మంత్రి
అనీల్ కుమార్ యాదవ్ .....
ఇప్పుడు ఏపీలో సీఎం మొదలుకొని వైసీపీకి చెందిన నాయకుల ప్రతి ఒక్కరి టార్గెట్ వారే చంద్రబాబు, లోకేష్ . ఎవరికి వారు టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబుపై, ఆయన కుమారుడు మాజీ మంత్రి లోకేష్ పై విరుచుకుపడుతున్నారు .
ఇక తాజాగా మంత్రి అనీల్ కుమార్ యాదవ్ చంద్రబాబు, లోకేష్ ల వల్ల టీడీపీ ముందుకు నడవదని కొత్త నాయకుడు కావాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల కాలంలో లోకేష్ ట్విట్టర్ వేదికగా చెలరేగిపోతున్నారు.
ఇక లోకేష్ ట్విట్టర్ పోస్ట్ లపై స్పందించిన మంత్రి అనీల్ కుమార్ యాదవ్ చంద్రబాబు తనయుడు లోకేశ్ బయటకి వచ్చి మాట్లాడితే తప్పులు వస్తాయని భయపడి ట్వీట్‌లు పెడుతున్నారని ఎద్దేవా చేశారు.
లోకేశ్ ట్వీట్‌లు ఆయనే చేస్తున్నారో.. లేక ఎవరితోనైనా రాయిస్తున్నారో కూడా తెలియదన్నారు.
లోకేష్ కు ట్వీట్లు రాసేంత తెలివి వుందని తాను అనుకోవటం లేదని పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను ఉద్దేశించి ట్విట్టర్ చిలుక..ట్విట్టర్ పలుకులు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు మంత్రి అనీల్ కుమార్ యాదవ్.
టీడీపీలో చంద్రబాబు తర్వాతి నాయకుడు ఎవరిని ఆ పార్టీ నేతలు వెతుక్కుంటున్నారని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీలో నాయకత్వ లోపం ఉందన్నారు. తెలుగు దేశం పార్టీని నడిపించటం వారిద్దరి వల్ల కాదని ఆయన తేల్చి చెప్పారు.
చంద్రబాబు ముసలివారయ్యారని , ఇక లోకేష్ పులికేసి లాంటివారని అనిల్ కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు.
తెలుగుదేశం పార్టీకి నూతన నాయకుడు అవసరం వచ్చిందన్న అనీల్ కుమార్ యాదవ్ అందువల్లే టీడీపీలో తర్వాత నాయకుడు ఎవరు అని ఆ పార్టీ నేతలు వెతుకుతున్నారని పేర్కొన్నారు.
Comments
Post a Comment