గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల సమీక్ష

అమరావతి

గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల సమీక్షపై ప్రభుత్వం ఉన్నతస్థాయి సంప్రదింపుల కమిటీని ఏర్పాటు చేసింది.

9 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

గత ప్రభుత్వంలో సౌర, పవన విద్యుత్తు కొనుగోళ్లలో భారీ అవకతవకలు జరిగినట్లు గుర్తించిన ప్రభుత్వం...సౌర, పవన విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలను సమీక్షించేందుకు కమిటీని ఏర్పాటు చేసింది.

మార్కెట్​లో తక్కువ ధరకు సౌర, పవన విద్యుత్ లభిస్తున్నా..గత ప్రభుత్వం ఎక్కువ ధరకు ఒప్పందాలు చేసుకోవటంపై సమీక్ష జరిపి అవసరమైన సిఫార్సులు చేయాలని ఆదేశించింది.

ట్రాన్స్‌కో సీఎండీ ఈ కమిటీకి కన్వీనర్​గా వ్యవహరించనున్నారు.

ఈ కమిటీలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బాలినేని శ్రీనివాస రెడ్డి, అడ్వకేట్ జనరల్, అజయ్ కల్లం, రావత్ , ఇంధన శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉన్నారు.

డిస్కంలకు తక్కువ ధరలకు విద్యుత్తు అమ్మేవారితో ఈ కమిటీ సంప్రదింపులు జరపనుంది.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?