రకుల్‌ను చుట్టిముట్టిన బిచ్చగాళ్లు.. ఇంతకీ ఏం చేసారంటే..

గత కొన్నేళ్లుగా రకుల్ ప్రీత్ సింగ్‌కు తెలుగు, తమిళంలో సరైన విజయాలు లేవు. మరోవైపు హిందీలో అజయ్ దేవ్‌గణ్ సరసన నటించిన ‘దే దే ప్యార్ దే’ సినిమా హిట్టైయిన ఆ క్రెడిట్ మొత్తం అజయ్ దేవ్‌గణ్, టబు మాత్రమే దక్కడం రకుల్‌ను మరింత నిరాశకు గురిచేసింది. మరోవైపు ఈ సినిమాను తెలుగులో వెంకటేష్ రీమేక్ చేస్తున్నాడు. అంతేకాదు ఈ  రీమేక్‌లో కూడా టబుతో పాటు రకుల్ ప్రీత్ సింగ్ యాక్ట్ చేయడం విశేషం.ఇలా ఒక భాషలో హిట్టైయిన సినిమా రీమేక్‌‌లో వాళ్లే నటించడం అనేది చాలా రేర్ అనే చెప్పాలి. మరోవైపు తెలుగులో నాగార్జున సరసన ‘మన్మథుడు 2’ చేస్తోంది. ఈ సినిమాపై రకుల్ భారీ ఆశలే పెట్టుకుంది. ఎందుకంటే రీసెంట్‌గా ఈ భామ తమిళంలో సూర్య సరసన నటించిన ‘ఎన్జీకే’ మూవీ ఫ్లాప్‌తో డీలా పడింది. ఐనా తరుచు వార్తల్లో నిలిచే రకుల్ ప్రీత్ సింగ్.. రీసెంట్‌గా ముంబైలో భారీ వర్షాల కారణంగా ముంబై ఎయిర్ పోర్ట్‌లో చిక్కుకోవడం సంచలనంగా మారింది. తాజాగా ఈ భామ మరోసారి వార్తల్లో నిలిచింది. వివారాల్లోకి వెళితే..

తాజాగా రకుల్ ప్రిత్ సింగ్‌కు ముంబైలో బిచ్చగాళ్ల వల్ల చేదు అనుభవం ఎదురైంది. అంతేకాదు ఆమెను బిచ్చగాళ్లు చుట్టిముట్టి వేధించడం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అచ్చు పోకిరి సినిమాలో బ్రహ్మానందాన్ని వెంటాడినట్టు రకుల్‌ను వెంటాడారు. కొంత మంది రకుల్‌ను ఇష్టమొచ్చిన చోట తాకారు. ఇక రకుల్ వారికి కాస్తంత డబ్బులు ఇచ్చిందా అంటే అది లేదు. దీనిపై పలువురు నెటిజన్స్ పలు రకాలుగా స్పందించారు. బోలేడు డబ్బులు సంపాదిస్తున్న రకుల్.. తన సెక్యురిటీ కోసం బాడీగార్డ్స్ పెట్టుకుంటే మంచిదన్నారు. మరోవైపు ఇంకో నెజిజన్ స్పందిస్తూ... బిచ్చగాళ్లకు డబ్బులు ఇవ్వడం అంటే వారిని బద్దకస్తులను చేసినట్టే అని వ్యాఖ్యానించారు.ఇంత సంపాదిస్తున్నాం బెగ్గర్స్‌కు ఇంత బిచ్చం వేస్తే పోయేదేముంది అంటూ మరి కొందరు వ్యాఖ్యానించారు. మొత్తానికి బిచ్చగాళ్లు రకుల్‌ను వేదించినా.. ఆమె మాత్రం చిల్లిగవ్వ ఇవ్వకుండా తన వాహనంలో ఎక్కి తెలివిగా తప్పించుకుంది.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?