కాపు రిజర్వేషన్ల అంశం ఇవాళ్టిది కాదు

అమరావతి:

కాపు రిజర్వేషన్ల అంశం ఇవాళ్టిది కాదని.. గత కొన్నేళ్లుగా ఆ సామాజికవర్గానికి చెందిన వారు పోరాడుతున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు. కాపు రిజర్వేషన్లపై తనను విమర్శిస్తే తాను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుందని.. దానికి స్పీకర్‌ అవకాశం ఇవ్వాలన్నారు. సభా నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు లేచినప్పుడు అవకాశం ఇవ్వడం సంప్రదాయంగా వస్తోందన్నారు. శాసనసభలో బడ్జెట్‌పై చర్చలో భాగంగా కాపు రిజర్వేషన్ల అంశంపై చంద్రబాబు మాట్లాడారు.  పదిశాతం రిజర్వేషన్లు ఓసీలకు ఇస్తే.. అందులో కాపులకు 5 శాతం కేటాయిస్తూ తమ ప్రభుత్వ హయాంలో బిల్లు తీసుకొచ్చామని చెప్పారు. కాపులకు 5శాతం బిల్లుపై ప్రస్తుత ప్రభుత్వ వైఖరేంటో చెప్పాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. సామాజిక న్యాయం చేసేందుకే కాపులకు కూడా రిజర్వేషన్లు తీసుకొచ్చామన్నారు. దీనిపై వైకాపా ప్రభుత్వం తమ వైఖరిని సూటిగా తెలియజేయాలన్నారు

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?