ఉద్రిక్తంగా రేపల్లె

గుంటూరు జిల్లా

టీడీపీ ఎమ్మెల్యే ఫ్లెక్సీ తొలగించిన...
వైసీపీ శ్రేణులు!
- ఉద్రిక్తంగా రేపల్లె

పెల్లుబికిన పెను ఆగ్రహమో... లేక చాలా కాలంగా పేరుకుపోయిన రాజకీయ కక్షో... తెలీదు కానీ... రేపల్లె వైసీపీ శ్రేణుల ధాటికి - స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఫ్లెక్సీ బలైంది.

రేపల్లె రాజ్యలక్ష్మీ సెంటర్లో ఉన్న అనగాని  ప్లెక్సీని  వైసీపీ నాయకులు తొలగించారు. 

మంగళవారం రాత్రి భారీగా వందల సంఖ్యల్లో వైసీపీ శ్రేణులు అక్కడికి చేరుకుని దౌర్జన్యంగా ప్లెక్సీని తొలగించారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

పోలీసులు అక్కడే ఉండి కూడా దాన్ని నివారించ లేకపోవడం గమనార్హం.

ఇంకో విశేషం ఏమిటంటే... ఇక్కడ అనగానిపై ఓటమి చెందిన మోపిదేవి వెంకటరమణ ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?