పవన్ కళ్యాణ్ ఓటమిపై జనసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

భీమవరంలో పవన్ కళ్యాణ్‌పై గెలిచేందుకు ప్రత్యర్థులు రూ. 75 కోట్లు ఖర్చు చేశారని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అన్నారు. ప్రత్యర్థులు ఎంత డబ్బు ఖర్చు చేసినా... తాము మాత్రం సిద్ధాంతాల ఆధారంగానే ప్రజలను ఓట్లు అడగాలని నిర్ణయించుకున్నామని ఆయన అన్నారు. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా తమకు ఇదే విషయాన్ని స్పష్టం చేశారని ఎమ్మెల్యే రాపాక తెలిపారు. గత ఎన్నికల్లో జనసేన అనేక ఎన్నికల్లో గెలవాల్సిన ఉందని... అయితే కొన్ని లోపాల కారణంగా ఓడిపోయామని ఆయన అన్నారు. తన నియోజకవర్గంలో తాను గెలవడానికి కారణంగా పార్టీ పరంగా గ్రామస్థాయిలో కమటీలు వేసుకోవడమే అని ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అన్నారు.

మిగతా నియోజకవర్గాల్లో లేకున్నా... తన నియోజకవర్గంలో మాత్రం అన్ని గ్రామాల్లో పార్టీ తరపున గ్రామ కమటీలు వేసుకున్నామని అన్నారు. ఆ గ్రామ కమిటీలు సమర్థవంతంగా పని చేయడం వల్లే తాను ఎన్నికల్లో విజయం సాధించానని రాపాక వరప్రసాద్ అన్నారు. ఇదే విషయాన్ని తాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకొచ్చానని ఆయన వివరించారు. రాబోయే రోజుల్లో గ్రామస్థాయి నుంచి పార్టీ కమిటీలు వేసుకుంటామని అన్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?