తెదేపా ప్రభుత్వ హయాంలో చర్యల కారణంగానే రాష్ట్రంలో విత్తన సమస్య

గుంటూరు

తెదేపా ప్రభుత్వ హయాంలో చర్యల కారణంగానే రాష్ట్రంలో విత్తన సమస్య నెలకొందన్న వైకాపా ఆరోపణలపై చంద్రబాబు మండిపడ్డారు.

తమ ప్రభుత్వ పాలనలో ఒక్కసారి కూడా ఎరువులు, విత్తన సమస్యలు లేకుండా చేశామని గుర్తు చేశారు.

గుంటూరులోని తెదేపా కార్యాలయానికి వచ్చిన ఆయన మీడియాతో ఇష్టాగోష్టిలో పలు వ్యాఖ్యలు చేశారు.

తెదేపా వల్లే ఇప్పుడు రైతులు రోడ్డెక్కారని వైకాపా అంటే... ప్రజలు నమ్మే స్థితిలో లేరని చంద్రబాబు అన్నారు.

'మేము అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే విద్యుత్ కోతలు లేకుండా చేశాం.

వైకాపా వచ్చిన నెల రోజుల్లో విద్యుత్ కోతలు మళ్లీ మొదలయ్యాయి.

రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ కోతల వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి' అని చంద్రబాబు అన్నారు.

అనంతరం పార్టీ కార్యాలయంలో సీనియర్ నేతలతో సమావేశం నిర్వహించి తాజా పరిణాలపై చర్చించారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?