మహారాష్ట్రలో మరో ప్రభుత్వ అధికారిపై రాజకీయ నాయకుల దాడి

మహారాష్ట్ర:

మహారాష్ట్రలో మరో ప్రభుత్వ అధికారిపై రాజకీయ నాయకుల దాడి సంచలనం సృష్టించింది. ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నితేష్‌ రాణే అతని అనుచరులు బకెట్‌లో బురదను తీసుకొచ్చి.. ఓ జాతీయ రహదారి ఇంజనీర్‌పై చల్లారు. ఈ ఘటనకు బాధ్యుడైన ఎమ్మెల్యే నితేష్‌ రాణే ప్రముఖ రాజకీయ నాయకుడు నారాయణ్‌ రాణే తనయుడు. బాధితుడ్ని జాతీయ రహదారి ఇంజినీర్‌ ప్రకాష్‌ షెడెకర్‌గా గుర్తించారు. ఇంజినీర్‌ ప్రకాష్‌ పనుల్లో ఉండగా ఎమ్మెల్యే అతని అనుచరులు బురద చల్లారని మీడియా వర్గాలు తెలిపాయి. అంతటితో వదలకుండా అతన్ని వంతెనకు కట్టేశారని తెలిపాయి.
గతవారం ఎంపీ విజయ వర్గీయ తనయుడు ఆకాష్‌ విజయ వర్గీయ మున్సిపల్‌ అధికారి ధీరేంద్ర సింగ్‌పై క్రికెట్‌ బ్యాట్‌తో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇండోర్‌లోని గంజ్‌ కాంపౌడ్‌ కూల్చివేతపై ఇరువురి మధ్య జరిగిన వాగ్వాదంతో ఈ ఘటన చోటు చేసుకుంది.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?