బీఎస్‌ఎఫ్‌లో 1072 ఉద్యోగాలు
భారత హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్)..
కమ్యూనికేషన్ విభాగంలో తాత్కాలిక ప్రాతిపదికన 1072 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది
. మొత్తం ఖాళీల్లో 25 శాతం ఖాళీలను బీఎస్‌ఎఫ్‌లో పనిచేస్తున్న అభ్యర్థులకు కేటాయించారు.*
*👉పోస్టుల వివరాలు..*
హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్) : 300
హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్) : 772
*అర్హత: పోస్టులను బట్టి గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ లేదా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత. నిర్దిష్ట శారీరక ప్రమాణాలుండాలి.*
*🔆వయసు: 2019, జూన్ 12 నాటికి 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.*
*ఎంపిక: రాతపరీక్ష, పీఎస్‌టీ/ పీఈటీ అండ్ డాక్యుమెంటేషన్, డిస్క్రిప్టివ్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.*
*👉దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.*
*👉దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.100, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, బీఎస్‌ఎఫ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న అభ్యర్థులకు ఫీజు లేదు.*
*👉దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 12, 2019.*
*👉పూర్తి వివరాలకు వెబ్‌సైట్:http://bsf.nic.in*
Comments
Post a Comment