108 ఆలస్యమైతే నా కారు తీసుకెళ్లండి: మంత్రి అనిల్

అమరావతి :‘108 ఆలస్యమైతే నా కారులో తీసుకెళ్లండి..’ ఈ మాటల అన్నది ఎవరో కాదండోయ్.. జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో జరిగే సమావేశానికి సోమవారం ఉదయం నెల్లూరు నుంచి వెళ్తుండగా మార్గమధ్యలో మేదర మెట్ల దగ్గర ఓ ప్రమాదం జరగడాన్ని మంత్రి గమనించారు.

దీంతో వెంటనే తన డ్రైవర్‌తో చెప్పి కారును ఆపించిన అనిల్.. రోడ్డు ప్రమాద బాధితులకు బాసటగా నిలిచారు.

ప్రమాదంలో గాయపడినవారిని చూసి చలించిపోయి తన కారులో వారిని వెంటనే ఆస్పత్రికి తరలించాలని సూచించారు.

అయితే.. అంతలోనే 108 రావడంతో మంత్రి అనుచరులు క్షతగాత్రులను ఆ వాహనంలో ఎక్కించి ఆస్పత్రికి తరలించారు.

ప్రాథమిక చికిత్స అనంతరం 108లో వారిని అక్కడ్నుంచి తరలించే వరకూ మంత్రి అనిల్ అక్కడే ఉండి అన్నీ చూసుకున్నారు.

మంత్రి అనిల్ చేసిన ఈ మంచి పనికి అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తూ మెచ్చుకుంటున్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?