ఆరు నెలల్లో 113 మంది ఉగ్రవాదులు హతం

న్యూఢిల్లీ : ఈ ఏడాది ప్రారంభం నుంచి జూన్‌ 16వ తేదీ వరకు జమ్మూకశ్మీర్‌లో 113 మంది ఉగ్రవాదులను భారత బలగాలు మట్టుబెట్టినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌ రెడ్డి ఇవాళ లోక్‌సభలో వెల్లడించారు.

ఈ ఆర్నేళ్ల కాలంలో 18 మంది పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. 2016 నుంచి ఇప్పటి వరకు మొత్తం 733 మంది ఉగ్రవాదులు హతమయ్యారని చెప్పారు.

టెర్రర్‌ దాడులు 2014 నుంచి ఇప్పటి వరకు మూడింతలు పెరిగాయన్నారు.

2014లో 222 ఉగ్రదాడులు చోటు చేసుకోగా, 2018లో ఆ సంఖ్య 614కు చేరిందని కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు.

2018లో 257 మంది టెర్రరిస్టులు, 2017లో 213 మంది, 2016లో 150 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వెల్లడించారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?