అగ్రిగోల్డ్ బాధితుల‌కు రూ.1150 కోట్లు పంపిణీ చేయాలి

అగ్రిగోల్డ్ బాధితుల‌కు రూ.1150 కోట్లు పంపిణీ చేయాలి : సిఎం జగన్‌

అమరావతి : అగ్రిగోల్డ్‌ బాధితులకు వెంటనే సహాయం అందేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.

అగ్రిగోల్డ్‌ యాజమాన్యం, బాధితులు, సీఐడీ అధికారులతో త్వరలోనే సమావేశం అవుతానని వెల్లడించారు.

మంగళవారం రెండో రోజు కలెక్టర్ల సదస్సులో భాగంగా పలువురు ఉన్నతాధికారులతో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన 1150 కోట్ల రూపాయలు త్వరితగతిన బాధితులకు పంపిణీ చేయాలని ఆదేశించారు.

అగ్రిగోల్డ్‌ యాజమాన్యానికి సంబంధించిన ఆస్తుల స్వాధీన ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు.

అదే విధంగా ఈ కంపెనీకి సంబంధించిన విలువైన ఆస్తులపైనా దృష్టి సారించాలని పేర్కొన్నారు.
     

కాగా  అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా ఉండేలా సీఎం వైఎస్‌ జగన్‌ కేబినెట్‌ తీసుకున్న నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా అగ్రిగోల్డ్‌ బాధితులకు 1150 కోట్ల రూపాయల కేటాయిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు.

ఈ క్రమంలో తొమ్మిది లక్షల మంది బాధితులకు ఒకేసారి న్యాయం జరుగనుందని అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు విశ్వనాథ్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. 

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?