ఈనెల 12 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

అమరావతి: ఈనెల 12వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

ఈ నేథప్యంలో ఎల్పీ కార్యాలయాలు, ఛాంబర్ల కేటాయింపులపై అసెంబ్లీ సిబ్బందిగా బిజీగా ఉంది.

ప్రస్తుతం ఉన్న వైఎస్సార్సీఎల్పీ, టీడీఎల్పీ కార్యాలయాల మార్పుపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది.

అసెంబ్లీలోని సీఎం జగన్ మోహన్‌ రెడ్డి ఛాంబర్‌ను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు.

అయితే, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు చాంబర్ కేటాయింపుపై అధికారులు ఇంకా స్పష్టతకు రాలేదు.

అదేవిధంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలు, చీఫ్ విప్, ఐదుగురు విప్‌‌లకు చాంబర్ల కేటాయింపుపై కూడా అధికారులు తర్జన భర్జన పడుతున్నారు.

గత ప్రభుత్వంలో ఇద్దరు డిప్యూటీ సీఎంలకు కలిపి ఒకే చాంబర్ కేటాయించగా.. ఇప్పుడు ఐదుగురు డిప్యుటీ సీఎంలు కావడంతో అధికారులు సందిగ్ధంలో పడ్డారు.

అయితే అసెంబ్లీ లాబీల్లో చీఫ్ విప్‌, విప్‌ల చాంబర్లు.. మొదటి అంతస్థులో మంత్రుల చాంబర్లు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?