బిగ్ బాస్ సీజ‌న్ 13 కోసం స‌ల్మాన్ ఖాన్‌కు 400 కోట్ల పారితోషికం..

న‌మ్మ‌డానికి ఇది కాస్త క‌ష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు ఒక్క షో కోసం ఆస్తులు రాయించుకుంటున్నాడు స‌ల్మాన్ ఖాన్. బాలీవుడ్లో బిగ్ బాస్ షోకు ఉన్న పాపులారిటీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అక్క‌డ స‌ల్మాన్ ఖాన్ పుణ్య‌మా అని షో ఇంటింటా వ్యాపించింది. వారానికి రెండు సార్లు వ‌చ్చి ఆయ‌న ప‌ల‌క‌రిస్తే రేటింగ్స్ పేలిపోతుంటాయి. ఒక‌టి రెండు కాదు.. ఇప్ప‌టికే 12 సీజ‌న్స్ పూర్తి చేసుకుని 13వ సీజ‌న్‌కు అంతా సిద్ధ‌మ‌వుతుంది. ఇక ఇప్పుడు ఈ షో కోసం స‌ల్మాన్ ఖాన్ తీసుకుంటున్న పారితోషికం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. 

ఎందుకంటే సీజ‌న్ సీజ‌న్ మారుతున్న కొద్దీ ఈయ‌న రెమ్యున‌రేష‌న్ రేంజ్ కూడా పెరుగుతూ పోతుంది. ఒక‌టి రెండు కాదు ఏకంగా ఈ సారి 400 కోట్లు ఈ సీజ‌న్ కోసం తీసుకుంటున్నాడు స‌ల్మాన్ ఖాన్. 13వ సీజ‌న్లో మొత్తం 26 ఎపిసోడ్స్ ఉంటాయి. అంటే 13 వారాలు షూటింగ్ చేస్తే చాలు.. ఒక్కో ఎపిసోడ్ కోసం ఏకంగా 15.5 కోట్లు తీసుకుంటున్నాడు ఈయ‌న‌. అలా 26 ఎపిసోడ్స్ కోసం 400 కోట్ల‌కు పైగా రెమ్యున‌రేష‌న్ అందుకోబోతున్నాడు కండ‌ల వీరుడు. 

ఇది చూసిన త‌ర్వాత వామ్మో అని క‌ళ్లు తేలేయాల్సిందే. అలా ఉంటుంది మ‌రి స‌ల్మాన్ ఖాన్ మార్కెట్ అక్క‌డ‌. ఆయ‌న్ని కాకుండా మ‌రో హీరోను తీసుకుంటే షోకు ఉన్న పాపులారిటీ ఎక్క‌డ త‌గ్గిపోతుందో అని భ‌య‌ప‌డుతున్నారు షో నిర్వాహ‌కులు. అందుకే అంత అడుగుతున్నా కూడా ఏం మాట్లాడ‌కుండా సై అనేస్తున్నారు. ఇక తెలుగులో కూడా బిగ్ బాస్ సీజ‌న్ 3 మొద‌లు కాబోతుంది. ఇప్ప‌టికే తొలి సీజ‌న్ ఎన్టీఆర్.. రెండో సీజ‌న్ నాని హోస్ట్ చేసారు. ఇక మూడో సీజ‌న్ కోసం నాగార్జున వ‌స్తున్నాడు. జులైలోనే ఇది మొద‌లు కాబోతుంది.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?