ఈనెల 13 నుండి ఎ పి పి ఎస్ సి డిపార్ట్మెంట్ టెస్ట్ లు

సబ్ కలెక్టర్

తిరుపతి, జూన్ 12 : ఈ నెల 13 నుండి 18 వరకు జిల్లాలో   ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిపార్ట్మెంట్ టెస్టులు జరగనున్నట్లు తిరుపతి సబ్ కలెక్టర్ డా.మహేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు

. జిల్లాలో 5 పరీక్షా కేంద్రాలో రెండు సెషన్స్ గా ఉదయం 10.00 గంటల నుండి మద్యాహ్నం 12.00 గంటల వరకు, మద్యాహ్నం 3.00 గంటల నుండి సా 6.00 గంటల వరకు  నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈనెల 13 ,14 ,15 ,17,18 తేదీలలో 5 రోజులు ఇయాన్ డిజిటల్ జూపార్క్ , తిరుపతి కేంద్రంగా , ఈ నెల 16 న సిద్దార్థ ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల, పుత్తూరు, శ్రీనివాస ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్  కళాశాల , మురకం బట్టు బైపాస్ , చిత్తూరు , వేము ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కళాశాల , పి.కొత్తకోట , అన్నమాచార్య ఇన్సిటిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ , కరకంబాడి రోడ్ ,తిరుపతి ఒక్కరోజు ఈ కేంద్రాలలో పరీక్షలు నిర్వహణ వుంటుందని వివరించారు.

అభ్యర్థులకు బయోమెట్రిక్ హాజరు వున్నందున ఉదయం సెషన్స్ కు  ఉదయం 8.30 నుండి 9.30 వరకు  , మద్యాహ్నం సెషన్స్ కు మ.1.30 నుండి 2.30 గంటల లోపు మాత్రమే కేంద్రాలలోకి అనుమతిస్తారని, పరీక్షాకేంద్రాలలోకి మొబైల్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్ అనుమతి ఉండదని తెలిపారు.

అలాగే ఇన్విజిలెటర్స్ కూడా మొబైల్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్ తీసుకుని వెళ్లరాదని సబ్ కలెక్టర్ ఆ ప్రకటనలో తెలియజేశారు.

ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ ఎ వి ఎస్ మూర్తి , సెక్షన్ ఆఫీసర్ టిఎస్ రాజగోపాల్ , తహసీల్దార్లు , డిప్యూటీ తహసీల్దార్లు లైజన్ అధికారులుగా వ్యవహరించనున్నారని వివరించారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?