17 నుంచి టెన్త్ సప్లిమెంటరీ
అమరావతి : ఈ నెల 17 నుంచి పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ వి సుబ్బారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు పరీక్షలు నిర్వహిం చనున్నట్లు పేర్కొన్నారు.
www.bseap.org వెబ్‌సైట్‌లో హాల్‌టిక్కెట్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాఠశాలల వారీగా ఎన్‌ఆర్ హాల్‌టిక్కెట్లను పాఠశాలల లాగిన్‌ల ద్వారా వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని విద్యార్థులకు అందజేయాల్సి ఉంటుందన్నారు.
పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థి ఫోటో, అటెండెన్స్ షీట్, పరీక్ష కేంద్రాల ఎన్‌ఆర్ వివరాలతో హాల్ టిక్కెట్ల వివరాలను చీఫ్ సూపరింటెండెంట్లు పరిశీలించి అనుమతించాల్సి ఉంటుందన్నారు.
Comments
Post a Comment