రూ. 1.7 కోట్ల విలువైన అంబర్‌గ్రిస్ స్వాధీనం

ముంబయి: రూ. 1.7 కోట్ల విలువైన అంబర్‌గ్రిస్(తిమింగిలం వాంతి)ని ముంబయి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

స్పెర్మ్ వేల్ జీర్ణవ్యవస్థలో ఓ స్రావం మైనపు ముద్దగా విసర్ణించబడుతుంది.

దీన్నే అంబర్‌గ్రిస్ అంటారు. ఉష్ణ మండల సముద్రాల్లో లభిస్తుంది.

ఇది అత్యంత విలువైన పదార్థం. సుగంధ పరిమాళాల్లో దీన్ని ఉపయోగిస్తారు.

ఆల్కాహాల్, క్లోరోఫాం, కొన్ని రకాల నూనెల్లో ఇది కరుగుతుంది.

ఓ వ్యక్తి అందించిన సమాచారం మేరకు పోలీసులు, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా రైడ్ చేసి విద్యావిహార్ ప్రాంతంలోని సబర్భన్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఇతడి వద్ద నుంచి 1.3 కేజీల అంబర్‌గ్రిస్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్పెర్మ్ వేల్ అంతరించిపోతున్న జాబితాలో చేర్చబడింది.

వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద నిందితుడిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?