చంద్ర‌యాన్‌-2 జూలై 15వ తేదీన ప్ర‌యోగం

చంద్ర‌యాన్‌-2 మిష‌న్‌ను జూలై 15వ తేదీన ప్ర‌యోగించ‌నున్నారు.

ఈ విష‌యాన్ని ఇస్రో చైర్మ‌న్ డాక్ట‌ర్ కే శివ‌న్ తెలిపారు.

జూలై 15వ తేదీన తెల్ల‌వారుజామున 2 గంట‌ల 51 నిమిషాల‌కు ప్రయోగించ‌నున్నారు.

చంద్ర‌యాన్‌-2 మిష‌న్‌లో మూడు మాడ్యుళ్లు ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

జీఎస్ఎల్వీ మార్క్ త్రీ రాకెట్ ద్వారా ప్ర‌యోగిస్తారు.

చంద్ర‌యాన్‌-2 మొత్తం బ‌రువు సుమారు 3.8 ట‌న్నులు ఉంటుంది.

దాంట్లో ప్రొపెల్లంట్ బ‌రువే సుమారు 1.3 ట‌న్నులు ఉంది.

సెప్టెంబ‌ర్ 6 లేదా 7న చంద్ర‌యాన్‌-2 రోవ‌ర్ చంద్రుడిపై ల్యాండ్ అవుతుంద‌ని శివ‌న్ తెలిపారు.

చంద్ర‌యాన్‌-2 ప్రాజెక్టు ఖ‌రీదు 603 కోట్లు అని ఇస్రో చైర్మ‌న్ చెప్పారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?