ఈ నెల 20న జిఎస్టీ మండలి సమావేశం
న్యూఢిల్లీ : రెండోసారి ప్రధాని మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి జీఎస్టీ మండలి సమావేశం జరుగనుంది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ఈ సమావేశం జరుగనుంది.
ఈ మేరకు అన్ని రాష్ట్రాల ఆర్థికమంత్రులకు కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేకంగా ఆహ్వానం పంపింది.
జులై 5న పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ పై వివిధ వర్గాల అభిప్రాయాలను తీసుకోనున్నారు.
నిర్మలా సీతారామన్ రేపటి నుంచి రంగాలవారీగా నిపుణుల అభిప్రాయాలు స్వీకరించనున్నారు.
వ్యవసాయరంగ నిపుణులతో అభిప్రాయ సేకరణ ప్రారంభం కానుంది.
రేపు ఉదయం వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి రంగాల నిపుణులతో భేటీ కానున్నారు. అనంతరం రేపు మధ్యాహ్నం పారిశ్రామిక, వాణిజ్య సంఘాలతో సమావేశం కానున్నారు.
Comments
Post a Comment