మిరాజ్ 2000 యుద్ధ విమానాల‌ను అప్‌గ్రేడ్

గ్వాలియర్

పాకిస్థాన్‌కు చెందిన సైనిక విమానాలు మ‌న గ‌గ‌న‌త‌లంలోకి ప్ర‌వేశించ‌లేద‌ని, బాలాకోట్ ఘ‌ట‌న స‌మ‌యంలో పాక్‌లో ఉన్న ఉగ్ర‌స్థావ‌రాల‌ను మ‌నం టార్గెట్ చేశాం, కానీ శ‌త్రు దేశం మాత్రం మ‌న గ‌గ‌న‌త‌లంలోకి ప్ర‌వేశించ‌లేకపోయింద‌ని ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ ధ‌నోవా తెలిపారు.

గ్వాలియ‌ర్ ఎయిర్‌బేస్‌లో ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

మిరాజ్ 2000 యుద్ధ విమానాల‌ను అప్‌గ్రేడ్ చేస్తున్న‌ట్లు ఎయిర్ చీఫ్ చెప్పారు.

అయిద‌వ జ‌న‌రేష‌న్ లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను కూడా త‌యారు చేస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

ఏఎన్‌-32 సైనిక విమానాలు ఇక నుంచి కూడా ప‌ర్వ‌త శ్రేణుల్లో ప్ర‌యాణిస్తాయ‌ని ఆయ‌న చెప్పారు.

ఇటీవ‌ల అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ఏఎన్‌32 విమానం కూలిన విష‌యం తెలిసిందే. ఆ ప్ర‌మాదంలో 13 మంది చ‌నిపోయారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?