2047 వరకు బిజెపిదే అధికారం

అగర్తలా: ప్రధాని మోదీ కాంగ్రెస్ పాలన రికార్డును బద్దలుకొడతారని, 2047 వరకు బీజేపీదే అధికారమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ అన్నారు.

త్రిపురలో శుక్రవారం నిర్వహించిన ఓ సభలో ప్రసంగించిన ఆయన జాతీయవాదం బీజేపీ డీఎన్‌ఏలోనే ఉందన్నారు.

ఎన్నికలు జరుగుతున్నా జరగకపోయినా బీజేపీ అంటే జాతీయవాదం, జాతీయవాదం అంటే బీజేపీ అని రామ్ మాధవ్ అభివర్ణించారు.

దేశంలో ప్రస్తుతం మోదీ నాయకత్వంలోని బీజేపీ అధికారంలో ఉందని, భవిష్యత్తులోనూ మోదీజీ బీజేపీదే అధికారమన్నారు.

2022 నాటికి నవ భారత నిర్మాణం సాధ్యమవుతుందని, దేశంలో ఇండ్లు, ఉద్యోగాల సమస్య అనేది ఉండదన్నారు.

శత స్వాతంత్య్ర దినోత్సవమైన 2047 వరకు బీజేపీ అధికారంలో కొనసాగుతుందని, ప్రపంచ గురువుగా భారత్ అవతరిస్తుందని రామ్ మాధవ్ జోస్యం చెప్పారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?