జాతీయ విద్యా విధాన ముసాయిదాపై 22న రాష్ట్రాల సమావేశం

న్యూఢిల్లీ : జాతీయ విద్యా విధాన ముసాయిదాపై ఈ నెల 22వ తేదిన వివిధ రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వం సమావేశం కానుంది.

ఈ మేరకు అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, అధికారులకు కేంద్ర మానవ వనరుల శాఖ నుండి ఆహ్వానాలు వెళ్లాయి.

ఈ సమావేశంలో రాష్ట్రాల అభిప్రాయాలు సేకరిస్తామని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్‌ పోక్రియాల్‌ తెలిపారు. .

ప్రభుత్వం నియమించిన కె.కస్తూరి రంగన్‌ నేతృత్వంలోని కమిటీ వివిధ అంశాలపై అధ్యయనం చేసి ఇటీవల 484 పేజీల ముసాయిదాను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది.

దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన త్రిభాష విధానంపై పెద్దఎత్తున నిరసన వ్యక్తమైన సంగతి తెలిసిందే.

తమిళనాడు, కర్నాటక వంటి రాష్ట్రాల నుంచి పెద్దయెత్తున వచ్చిన వ్యతిరేకతతో 'హిందీ తప్పనిసరి'పై కేంద్రం వెనక్కు తగ్గింది.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?