అఫ్ఘన్ బౌలింగ్ అదుర్స్.. టీమిండియా స్కోర్ 224/8
వరల్డ్ కప్‌లో భారత్ గౌరవ ప్రదమైన స్కోర్ చేసింది. అఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 224/8 పరుగులు చేసింది. మ్యాచ్ ఆరంభం నుంచి అప్ఘన్ బౌలర్లు దూకుడుగా ఆడారు. టీమిండియా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అయిన ప్లేయర్లు కూడా అఫ్ఘన్ బౌలింగ్‌లో పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. భారత బ్యాట్స్‌మెన్‌లో విరాట్ కోహ్లీ (63 బంతుల్లో 67), లోకేష్ రాహుల్ (30), విజయ్ శంకర్ (29), ధోనీ (28), హార్దిక్ పాండ్యా (7), కేదార్ జాదవ్ (52), షమి (1 ), కుల్దీప్ ( 1 నాటౌట్ ) బుమ్రా (1 నాటౌట్ ) పరుగులు చేశారు. రోహిత్ శర్మ ఒక్క రన్ చేసి ఔట్ అయ్యాడు.
Comments
Post a Comment