24 గంటల్లో భారీ వర్షాలు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. దీని ప్రభావంతో పలు ప్రాంతాల్లో వానలు దంచికొడుతున్నాయి.
మరో 24 గంటల్లో భారీ వర్ష సూచన ఉందని వాతావరణశాఖ నిపుణులు తెలిపారు.
నలుదిక్కులా ఇప్పుడు నైరుతి పలుకరిస్తుంది. రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసాయి.
మరో మూడు రోజులు భారీ వర్షాలు ఖాయమని వాతావరణశాఖ అధికారులు చెప్పడంతో సాగుకు రైతు సిద్ధమవుతున్నాడు.
రాజస్థాన్ నుంచి చత్తీస్‌గఢ్ మీదుగా.. తూర్పు పశ్చిమ బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది.
చత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో తెలంగాణ, కోస్తాలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
రాయలసీమలో సాధారణ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. నాగర్‌కర్నూల్‌లో నిన్న 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.
అద్దంకిలో 8 సెం.మీ, శ్రీశైలంలో 7 సె.మీ. వర్షపాతం నమోదు అయింది.
రెండురోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
Comments
Post a Comment