ఇండియన్ నేవీలో 2,700 జాబ్స్.. ఇంటర్ చదివితే చాలు..
కేంద్ర రక్షణశాఖ పరిధిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. నేవీ సెయిలర్ పోస్టుల కోసం ఏఏ & ఎస్ఎస్‌ఆర్ ఫిబ్రవరి 2020 బ్యాచ్‌లో ప్రవేశాల కోసం అర్హత గల అవివాహిత పురుషుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 2,700 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో ఆర్టిఫైజర్ అప్రెంటీస్(ఏఏ) విభాగాల్లో 500, సీనియర్ సెకండరీ రిక్రూట్స్(ఎస్ఎస్ఆర్) విభాగాల్లో 2200 పోస్టుల కోసం దరఖాస్తులు కోరుతున్నారు. అభ్యర్థులు ఇంటర్ లేదా తత్సమాన కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించాలి.
మొత్తంపోస్టులు : 2,700
అర్హత : ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్‌తో పాటు కెమిస్ట్రీ/బయాలజీ లేదా కంప్యూటర్ సైన్స్‌లలో ఏదో ఒక సబ్జెక్టు చదివి ఉండాలి.
వయస్సు : 2000 ఫిబ్రవరి 1 నుంచి 2003 జనవరి 31 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం : కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్,మెడికల్ టెస్ట్ ద్వారా..
రాతపరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌లో...
అప్లికేషన్ ఫీజు : 205/-
రిజిస్ట్రేషన్ ప్రారంభం : జూన్ 28
చివరితేది : జులై 10
వెబ్‌సైట్ : www.joinindiannavy.gov.in
Comments
Post a Comment