జూన్ 28న హైదరాబాద్‌లో కేసీఆర్, జగన్ భేటీ...ఎజెండా ఇదే..

తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి మరోసారి కలవబోతున్నారు. జూన్ 28న హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో ఇరురాష్ట్రాల సీఎంలు సమావేశం కానున్నారు. ఏపీ, తెలంగాణ జల వివాదాల పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై కేసీఆర్, జగన్ చర్చించనున్నారు. గోదావరి జలాలను శ్రీశైలం ప్రాజెక్టుకు తరలింపు, లింక్ కెనాల్ వంటి అంశాలపై చర్చిస్తారని సమాచారం. జూన్ 29న కూడా ఇరువురు సీఎంలు మరోసారి భేటీ అవుతారని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

పలు కార్యక్రమాల నేపథ్యంలో వైఎస్ జగన్ జూన్ 26నే హైదరాబాద్‌కి రానున్నారు. 29 వరకు ఆయన నగరంలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశమై ఇరు రాష్ట్రాల జలవివాదాలపై కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశమున్నట్లు సమాచారం.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?