రీతూ-రాకెట్ వుమెన్ ఆఫ్ ఇండియా

చంద్రయాన్-2 మిషన్ డైరెక్టర్ రీతూ కరిధల్‌ను 'రాకెట్ వుమెన్ ఆఫ్ ఇండియా' అని పిలుస్తారు.

మార్స్ ఆర్బిటర్ మిషన్‌లో ఆమె డిప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.

ఏరోస్పేస్ ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన కరిధల్, లక్నో విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ చేశారు.

రీతూ 2007లో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ నుంచి 'ఇస్రో యంగ్ సైంటిస్ట్' అవార్డ్ కూడా అందుకున్నారు.

రీతూ కరిధల్‌కు చిన్నతనం నుంచీ సైన్స్‌ అంటే ఆసక్తి ఉండేది.

మార్స్ ఆర్బిటర్ మిషన్ తర్వాత ఆమె "నేను చంద్రుడి ఆకారం తగ్గడం, పెరగడం చూసి కంగారు పడేదాన్ని. అంతరిక్షలో చీకట్లు దాటి అవతల ఉన్న విశ్వం గురించి తెలుసుకోవాలని అనుకునేదాన్ని" అని చెప్పారు.

రీతూకు నచ్చిన సబ్జెక్ట్స్ ఫిజిక్స్, మ్యాథ్స్. ఆమె నాసా, ఇస్రో ప్రాజెక్టుల గురించి వార్తాపత్రిక కటింగ్స్ సేకరించేవారు.

స్పేస్ సైన్స్‌కు సంబంధించిన ప్రతి చిన్న విషయం గురించీ తెలుసుకోవాలని ప్రయత్నేంచేవారు.

సైన్స్, అంతరిక్షం అంటే ఉన్న ఆసక్తే రీతూను ఇస్రో వరకూ తీసుకొచ్చింది.

"పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక నేను ఇస్రోలో ఉద్యోగం కోసం అప్లై చేశాను, స్పేస్ సైంటిస్ట్ అయ్యాను" అని ఆమె చెప్పారు.

ఆమె దాదాపు 20-21 ఏళ్లలో ఇస్రోలో చాలా ప్రాజెక్టులపై పనిచేశారు. వీటిలో 'మార్స్ ఆర్బిటర్ మిషన్'

కుటుంబ సభ్యుల సహకారం లేకుండా ఎవరూ తమ లక్ష్యాన్ని సాధించలేరని రీతూ కరిఘల్ చెబుతారు.

ఆమెకు ఇద్దరు పిల్లలు, ఒక బాబు, ఒక పాప. తల్లి అయిన తర్వాత ఇంట్లో ఉంటూ కూడా ఆఫీస్ పని చేసేదాన్నని, అప్పుడు పిల్లల్ని చూసుకోవడంలో తన భర్త సాయం చేసేవారని రీతూ చెప్పారు.

"కుటుంబ సభ్యులు మీ ఆసక్తి, కష్టం చూసినప్పుడు వారికి కూడా మీకు అండగా నిలవాలని అనిపిస్తుంది" అన్నారు.

"నా కొడుకు 11 ఏళ్లు, పాపకు ఐదేళ్ల వయసులో మేం సమయం ఆదా చేయడానికి మల్టీ టాస్కింగ్ చేసేవాళ్లం.

ఆఫీస్‌లో బాగా అలసిపోయినా, ఇంటికి వచ్చి పిల్లలను చూడగానే నా అలసట అంతా పోయేది, చాలా బాగా అనిపించేది" అన్నారు.

"పురుషులు అంగారక గ్రహం నుంచి వస్తారని, మహిళలు శుక్రుడి నుంచి వస్తారని చెబుతారు.

కానీ మార్స్ మిషన్‌ విజయవంతం అయ్యాక చాలా మంది మహిళా శాస్త్రవేత్తలను 'మార్స్ మహిళలు' అనడం మొదలుపెట్టారు.

నేను భూమిపై అద్భుత అవకాశం అందుకున్న ఒక భారత మహిళను" అన్నారు.

స్టార్ ప్లస్‌లో టెడ్ టాక్ అనే ఒక కార్యక్రమంలో మాట్లాడిన రీతూ కరిధల్ "నాకు మా అమ్మనాన్నలు 20 ఏళ్ల క్రితం ఇచ్చిన ఆత్మవిశ్వాసం ఈరోజు తల్లిదండ్రులు తమ ఆడ పిల్లల్లో చూస్తున్నారు.

కానీ అమ్మాయిలు నగరాల్లో ఉన్నా, పట్టణాల వారైనా తల్లిదండ్రులు వారికి సరైన సహకారం అందిస్తేనే వారు చాలా ముందుకు వెళ్లగలరు" అని చెప్పారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?