శబరిమల యాత్రకు వెళ్లే ప్రయాణీకుల కోసం రైల్వే శాఖ 36 ప్రత్యేక రైళ్లు
గుంటూరు: శబరిమల యాత్రకు వెళ్లే ప్రయాణీకుల కోసం రైల్వే శాఖ 36 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఈ రైళ్లు హైదరాబాద్ - ఎర్నాకుళం - కొచ్చువేలి - హైదరాబాద్ మధ్యన రాకపోకలు సాగి స్తాయని తెలిపారు.
నెంబరు. 07115 హైదరాబాద్ - కొచ్చువేలి ప్రత్యేక రైలు జూలై, ఆగస్టు నెలల్లో ప్రతీ శనివారం రాత్రి 9.30 గంటలకు బయలుదేరి నల్గొండ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి మీదగా సోమవారం వేకువజామున 3.20 గంటలకు కొచ్చువేలి చేరుకొంటుంది.
నెంబరు. 07116 కొచ్చువేలి - హైదరాబాద్ ప్రత్యేక రైలు జూలై, ఆగస్టు నెలల్లో ప్రతీ సోమవారం, సెప్టెంబర్ 2వ తేదీన ఉదయం 7.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.20కి సికింద్రాబాద్, 2 గంటలకు హైదరాబాద్ చేరుకొంటుంది.
ఈ రైళ్లకి యాత్రికులు ఎక్కువగా దిగే త్రిసూర్, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, చెంగనూరులో నిలుపుదల సౌకర్యం కల్పించారు.
వీటిల్లో ఏసీ టూటైర్, త్రీటైర్, 10 స్లీపర్‌క్లాస్ భోగీలుంటాయి
Comments
Post a Comment