36 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున భారత క్రికెట్ చరిత్రలో మధుర జ్ఞాపకం

న్యూఢిల్లీ: 

36 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున భారత క్రికెట్ చరిత్రలో మధుర జ్ఞాపకంగా నిలిచే ఘటన ఒకటి జరిగింది.

లార్డ్స్‌లో జరిగిన ప్రపంచకప్ ఫైనల్‌లో విండీస్‌ను 43 పరుగుల తేడాతో ఓడించిన కపిల్‌దేవ్ సేన భారత్‌కు తొలి ప్రపంచకప్ అందించింది.

25 జూన్ 1983లో జరిగిన ఈ ఘటనకు నేటితో 36 ఏళ్ల నిండాయి.

సౌరవ్ గంగూలీ, మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలో భారత్‌ క్రికెట్‌లో స్వర్ణయుగం ప్రారంభమైందని అభిమానులు చెబుతున్నప్పటికీ పునాదులు మాత్రం కపిల్‌దేవ్ హయాంలో పడ్డాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

1983లో భారత్ ప్రపంచకప్‌ను చేజిక్కించుకున్నాక దేశంలో క్రికెట్‌కు ఆదరణ ఒక్కసారిగా పెరిగింది.

భారత జట్టు ప్రపంచకప్ గెలుచుకుని నేటికి సరిగ్గా 36 ఏళ్లు.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కపిల్ ప్రపంచకప్ ట్రోఫీ అందుకుంటున్న ఫొటోను బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.

ఈ జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయని పేర్కొంది.

లార్డ్స్‌లో జరిగిన పైనల్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 54.4 (అప్పట్లో 60 ఓవర్లు) ఓవర్లలో 183 పరుగులు చేసింది.

మొహిందర్ అమర్‌నాథ్ బౌలింగ్‌లో ఇరగదీసి మూడు కీలక వికెట్లు పడగొట్టి విండీస్‌కు కోలుకోలేని షాకిచ్చాడు.

దీంతో విండీస్ 140 పరుగులకే ఆలౌట్ 43 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అమర్‌నాథ్‌కు దక్కింది.

ప్రస్తుతం ప్రపంచకప్‌లోనూ భారత్ అప్రతిహతంగా దూసుకెళ్తోంది.

ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ సేన 9 పాయింట్లతో ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?