ప్రకాశం జిల్లాలో దివ్యాంగులనూ వదలని అవినీతి దయ్యం.. రూ.50లక్షల స్కాం

ప్రకాశం జిల్లాలో వికలాంగ సంక్షేమ శాఖలోని అవినీతిపై జిల్లా సంయుక్త కలెక్టర్ చేస్తున్న విచారణలో కళ్ లుబైర్లు కమ్మే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. లంచం డిమాండ్ చేస్తూ దొరికిపోయిన ఏడీ సింగయ్య చరిత్ర తవ్వేకొద్దీ అక్రమాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. ఎన్జీవో సంస్థ నిర్వాహకుడి వద్ద నుంచి లంచం డిమాండ్ చేస్తూ పరారీలో ఉన్న సింగయ్య.. అవినీతి చిట్టా విచారణ చేస్తున్న అధికారులకు కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలను తెలియజేస్తోంది. అసలు వికలాంగ సంక్షేమ శాఖ పెద్ద అక్రమాల పుట్టగా తెలుస్తోంది. దివ్యాంగ సంక్షేమ శాఖ ఏడీ సింగయ్య వృద్ధాశ్రమ అనుమతికి సంబంధించి రూ. 2 లక్షలకు బేరం పెట్టి... వీడియోలో అడ్డంగా దొరికిన పెట్టి దొరికిపోయారు. దీనిపై జిల్లా కలెక్టర్‌ పోలా భాస్కర్‌ ఆదేశాల మేరకు సంయుక్త కలెక్టరు-2 సిరి విచారణ చేపట్టారు. తన కార్యాలయంలో బాధితులతోనూ, ఇది వరకు లంచం ఇచ్చుకున్న కొందరు వ్యక్తులతోనూ మాట్లాడారు. పనిలో పనిగా సింగయ్య అవినీతి తతంగంపై విజిలెన్స్‌ అధికారులు గతంలో చేపట్టిన విచారణ నివేదికను జేసీ-2 సిరికి అందించారు. విజిలెన్స్‌ అదనపు ఎస్పీ రజని కూడా విచారణలో పాల్గొని నివేదికను అందజేసి, తాము పరిశీలించిన అంశాలను చెప్పారు. మరోవైపు.. అమరావతిలోని దివ్యాంగ సంక్షేమ శాఖ రాష్ట్ర సంచాలకులు కిషోర్‌ సైతం.. జిల్లా కలెక్టర్ తో మాట్లాడి నివేదిక ఇవ్వాలని కోరారు.
ఒంగోలులోని విభిన్న ప్రతిభావంతుల వసతిగృహంలో 17 మంది దివ్యాంగులు గత ఏడాది వసతి పొందారు. కానీ, రికార్డుల్లో 25 మంది విద్యార్థులు వసతిగృహంలో ఉన్నట్లు దస్త్రాల్లో చూపారు. ప్రభుత్వం నుంచి వచ్చే కాస్మోటిక్‌ ఛార్జీలు, నాలుగు జతల యూనిఫామ్స్ విద్యార్థులకు పంపిణీ చేయాల్సి ఉండగా.. ఆప్కో నుంచి దుస్తులకు సంబంధించి వస్త్రాలు కొనుగోలు చేసినట్లు బిల్లులు చేసుకుని విద్యార్థులకు మాత్రం ఇవ్వలేదని తెలుస్తోంది. దివ్యాంగుల ఉపాధి కొరకు స్వయం ఉపాధి రుణాల మంజూరుకు చేస్తారు. ఇక్కడ కూడా లంచం ఇస్తే గానీ సింగయ్య రుణాలు మంజూరు చేయలేదని బాధితులు విచారణలో తెలిపారు.
కందుకూరులో రూ. 37,28,543 లక్షల అక్రమాలు..!
కందుకూరులో బీఆర్‌ అంబేడ్కర్‌ ఆరోగ్య రక్షణ సొసైటీ పేరిట ఓ స్వచ్ఛంద సంస్థ ఉంది. దీనిలో నిజానికి ఈ ఎన్జీవో ఎవరూ చికిత్స తీసుకోవడం లేదు. కానీ, ఏడీ ఈ సంస్థకు లాభం చేకూర్చేలా... ఇక్కడ కొందరు చికిత్స తీసుకుంటున్నట్టు నివేదికలో చూపించి.. 2016-17, 2017-18కి రెండు సంవత్సరాలకు గాను ఏకంగా రూ. రూ.37,28,543 నిధులు మంజూరు చేయించారని విజిలెన్స్‌ అధికారులు నివేదిక రూపంలో .. ప్రకాశం జిల్లా సంయుక్త కలెక్టర్ కి అందజేశారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?