ఆరో తరగతి బాలికపై 6 నెలలుగా అత్యాచారం...ఆమె గర్భం దాల్చడంతో...

హన్మకొండలో 9 నెలల చిన్నారిపై హత్యాచార ఘటన మరవక ముందే దేశవ్యాప్తంగా ఇలాంటి ఘోరాలు ఎన్నో వెలుగుచూస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో దారుణం జరిగింది. ఆరో తరగతి విద్యార్థినిపై 45 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. గడిచిన కొన్ని రోజులుగా పలుమార్లు ఆమెపై అత్యాచారం జరిపాడు. బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం బయటకు పొక్కింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివరాజ్ అనే వ్యక్తి భోపాల్‌లో తోపుడు బండ్లపై వస్తువులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడి ఇంటి పక్కనే ఉండే 12 ఏళ్ల బాలికపై అతడి కన్నుపడింది. గత డిసెంబరులో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై అత్యాచారం జరిపాడు. విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదరించాడు. అప్పటి నుంచి పలుమార్లు బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు నిందితుడు. 

అమ్మాయి శరీరంలో మార్పులు రావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమె గర్భం దాల్చిందని డాక్టర్లు చెప్పడంతో షాకయ్యారు. గట్టిగా నిలదీస్తే..ఆ బాలిక అసలు విషయం చెప్పింది. పక్కింట్లో ఉండే శివరాజే దీనికి కారణమని ఏడుస్తూ తెలిపింది. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. శివరాజ్‌ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?