డబ్బుల్లేని ATMపై ఫైన్... ఆర్బీఐ కొత్త నిర్ణయం
ఇకపై ATMల ముందు గంటల తరబడి నో క్యాష్ బోర్డ్ వేలాడదీస్తే కుదరదు. 3 గంటలకు మించి ఆ బోర్డ్ ఉంటే, ఆ ఏటీఎం కేంద్రంపై ఆర్బీఐ చర్యలు తీసుకుంటుంది. జరిమానా వేసి... బ్యాంకుకి పంపిస్తుంది.
ఈ ఫైన్ అన్ని ఏటీఎంలకూ ఒకే విధంగా ఉండదు. ఏటీఎం ఉన్న ప్రదేశం, దానికి ఉన్న డిమాండ్, వచ్చే కస్టమర్లు అన్నింటినీ లెక్కలోకి తీసుకొని ఫైన్ వేసి... ఆ నోటీస్‌ను బ్యాంక్ శాఖకు పంపిస్తుంది ఆర్బీఐ. దేశంలో రోజూ కొన్ని లక్షల ఏటీఎంలు ఇలాగే పనిచెయ్యకుండా, డబ్బులు లేకుండా ఉన్నాయి. వాటి వల్ల కొన్ని కోట్ల మంది ఇబ్బంది పడుతున్నారు. కొంతమందైతే ఏటీఎంలలో డబ్బుల కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. ఆర్బీఐ నిర్ణయం మనకు కలిసొచ్చే అంశమే. ఇలాంటి ఫైన్లు వేస్తేనే బ్యాంకులు జాగ్రత్త పడి... ఏటీఎంలలో ఎప్పటికప్పుడు క్యాష్ ఫిలప్ చేస్తాయని భావించవచ్చు.
Comments
Post a Comment