జిల్లాలోనిప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి, ఉత్తమ విద్యా ప్రమాణాలను నెలకొల్పడం కోసం అనేక సంస్కరణలను చే పడుతున్నాము.

ఇన్చార్జి కలెక్టర్

ఆత్మకూరు : జిల్లాలోని అన్ని ప్రభుత్వపాఠశాలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి, ఉత్తమ విద్యా ప్రమాణాలను నెలకొల్పడం కోసం అనేక సంస్కరణలు చేపడుతున్నామని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఢిల్లీ రావు పేర్కొన్నారు.

బుధవారం ఆత్మకూర్ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నందు రాజన్న బడిబాట కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్2 సుబ్బరాజు,  జిల్లా ఇంచార్జ్ విద్యాశాఖ అధికారి దేవరాజులు, జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ రాఘవ తదితరులు పాల్గొన్నారు.

సరస్వతి పూజా కార్యక్రమాల నిర్వహించి

. జాతీయ పతాకాన్ని ఎగరవేశారు పండుగ వాతావరణంలో రాజన్న బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు

. అనంతరం ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నుండి ఈ నెల 15వ తేదీ వరకు రాజన్న బడిబాట కార్యక్రమం అన్ని జిల్లాలలో ఘనంగా నిర్వహించుచున్నారు అని తెలిపారు.

ఈ నాలుగు రోజులలో ఒక్కొక్క రోజు ఒక అంశంపై రాజన్న బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ రోజున స్వాగత సంబరం,

13వ తేదీన నంద నాభినయం,

14వ తేదీన అక్షరం

, 15వ తేదీన వందనం - అభినందనం అనే అంశాలపై కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.

విద్యార్థులు ఎవరైతే ప్రణాళిక ప్రకారం కష్టపడే తత్వం, మరియు మంచి నడవడిక అలవర్చుకుంటారు వారు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకుంటారని తెలిపారు నా దృష్టిలో విద్యార్థి యొక్క తెలివికి మార్కులు ప్రామాణికము కాక పోయినప్పటికీ ప్రస్తుతం విద్యా విధానంలో జ్ఞాపకము ను పరీక్షించి ఎవరైతే చదివిన  ఆకళింపు చేసుకుంటారు

ఆ విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు అని తెలిపారు.

అమ్మ ఒడి కార్యక్రమం ప్రారంభం రోజున బడికి పంపి ప్రతి తల్లికి 15,వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించే అమ్మ ఒడి కార్యక్రమం వచ్చే ఏడాది జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం ప్రారంభం చేయడం జరుగుతుందని తెలిపారు.

అన్ని ప్రభుత్వ పాఠశాలలో పిల్లల సంఖ్య చేర్పించాలని టీచర్ లను ఆదేశించారు. 

ప్రభుత్వ పాఠశాలలో వచ్చే సదుపాయాలను, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.

ఈ పాఠశాలలో మంచి ఫలితాలు రావడం జరిగిందని తెలిపారు. 2019 ssc ఫలితాల నందు ఈ పాఠశాలఋ ఇంగ్లీష్ మీడియం నందు, 100%తెలుగు మీడియం 98 శాతం ఫలితాలు రావడం జరిగిందని తెలిపారు.

ఈ పాఠశాలలో పరిసరాలు, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నదని, అలాగే మంచి క్రీడాస్థలం ఉన్నదని తెలిపారు. 

సంయుక్త కలెక్టర్ 2 మాట్లాడుతూ దారిద్ర్య రేఖ దిగువనున్న కుటుంబాల పిల్లలు బడి మానేసి ఉంటారని వారిని గుర్తించి వారిని బడిలో చేర్పించే విధంగా విద్యాశాఖ అధికారులు కృషిచేయాలని తెలిపారు.

అమ్మబడి కార్యక్రమం క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.

అనంతరం విద్యాశాఖ అధికారి దేవరాజు మాట్లాడుతూ ఈ నాలుగు రోజులలో రాజన్న బడిబాట కార్యక్రమం పండుగ వాతావరణంలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు.

ఈ పాఠశాలలో ప్రస్తుతం పదోతరగతి చదువుతున్న విజయేంద్ర వర్మ మాట్లాడుతూ గతంలో ఐదో తరగతి నుండి ఎనిమిదో తరగతి వరకు కార్పొరేట్ కళాశాలలో చదవడం జరిగిందని.

అక్కడ  భయపడేవాతావరణంలో చదువుకున్నానని తెలిపారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో ఉపాధ్యాయులు మరియు తోటి విద్యార్థులు స్నేహిత వాతావరణంలో చదువుకుంటున్నా మని తెలిపారు 2019 ఈఉన్నత పాఠశాలలో పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థుల   కే నందిని బి.వసంత విద్యార్థులు వారి అనుభవాలను విద్యార్థులతోముచ్చటించారు.

ఇన్చార్జి కలెక్టర్ చేతుల మీదుగా ఈరోజు ఈ పాఠశాలలో ఐదు మంది విద్యార్థులకు నూతనంగా ఆయా తరగతులకు ప్రవేశ ధ్రువ పత్రాలు అందజేశారు, ఇన్చార్జి కలెక్టర్ చేతుల మీదుగా పిల్లలకు పాఠ్య పుస్తకాలు, షు, ఇతర మెటీరియల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్వ శిక్షా అభియాన్ పి ఓ రాంచంద్రారెడ్డి, తాసిల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీవో దస్తగిరి, ఎం ఈ ఓ, నరసింహారెడ్డి, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?