మరోసారి పెద్ద మనసు చాటుకున్న బాలయ్య.. ఫీలవుతున్న ఫ్యాన్..
మరోసారి నందమూరి నట సింహం బాలకృష్ణ తన పెద్ద మనసు చాటుకున్నాడు. కానీ అభిమానులు మాత్రం బాలయ్య పెద్ద మనసు చూసి తెగ ఫీలవుతున్నారు. పెద్ద మనసుతో ఏదైనా పనిచేస్తే ఫ్యాన్స్ ఆనందించాలని కానీ.. ఎందుకు ఫీలవుతున్నారని డౌటు వచ్చింది కదా.. వివరాల్లోకి వెళితే.. గత కొన్నేళ్లుగా బాలయ్య ఏ సినిమా తీసుకున్న అందులో అంతగా గుర్తింపు లేని భామలతోనే నటిస్తున్నాడు. ఒక్క ‘జై సింహా’లో నయనతార.. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’లో విద్యాబాలన్, రకుల్ ప్రీత్ సింగ్ వంటి హీరోయిన్స్ మినహాయిస్తే.. ఎక్కువ మటుకు ఔట్ డేటేడ్ హీరోయిన్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఇక బాలకృష్ణ సెంచరీ మూవీ ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ కోసం ఎంతో మంది హీరోయిన్స్ కోసం వెతికి వెతికి.. చివరకు అపుడెపుడే బాలయ్యతో ‘చెన్నకేశవరెడ్డి’ సినిమాలో రొమాన్స్ చేసిన ‘శ్రియ’తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ సినిమా అంటే యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్ర కాబట్టి సరిపోయింది. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పైసా వసూల్’లో మెయిన్ హీరోయిన్‌గా మరోసారి శ్రియతోనే యాక్ట్ చేసాడు.
ఆ తర్వాత ‘ఎన్టీఆర్ కథానాయకుడు’లో ప్రభ పాత్రలో శ్రియ కొంచెం సేపు తళుక్కున మెరిసింది. కట్ చేస్తే..తాజాగా బాలకృష్ణ..మరోసారి కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో చేయబోతున్న సినిమాలో మరోసారి బాలయ్య.. తన సరసన శ్రియకు కథానాయికగా చాన్స్ ఇచ్చి మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నట్టు సమాచారం.
Comments
Post a Comment